Ian Gould: భారత్-శ్రీలంక మ్యాచ్ తర్వాత రిటైర్మెంట్ ప్రకటించిన అంపైర్ ఇయాన్ గౌల్డ్
- అత్యుత్తమ అంపైర్లలో ఒకరిగా గౌల్డ్‌కు గుర్తింపు
- అంపైరింగ్‌కు ముందు వికెట్ కీపర్‌గా ఇంగ్లండ్‌కు ప్రాతినిధ్యం
- 13 ఏళ్ల క్రితం తొలి టీ20 ఆడిన గౌల్డ్
ప్రపంచంలోని అత్యుత్తమ అంపైర్లలో ఒకరైన ఇంగ్లండ్‌కు ప్రాతినిధ్యం వహించిన ఇయాన్ గౌల్డ్ రిటైర్మెంట్ ప్రకటించారు. ప్రపంచకప్‌లో భాగంగా శనివారం లీడ్స్‌లో జరిగిన భారత్-శ్రీలంక మ్యాచ్ తర్వాత రిటైర్ కాబోతున్నట్టు అంతకుముందే ప్రకటించి అందరినీ ఆశ్చర్చపరిచారు. గౌల్డ్ ఇప్పటి వరకు 74 టెస్టులకు అంపైరింగ్ బాధ్యతలు నిర్వర్తించారు. భారత్-శ్రీలంక మ్యాచ్‌తో 140 వన్డేలకు అంపైరింగ్ పూర్తి చేశారు. గౌల్డ్‌కు ఇది నాలుగో ప్రపంచకప్. 2011 ప్రపంచకప్‌లో భాగంగా మొహాలీలో భారత్-పాకిస్థాన్ మధ్య సెమీఫైనల్స్‌కు అంపైరింగ్ బాధ్యతలు నిర్వర్తించింది కూడా గౌల్డే.
వికెట్ కీపర్‌గా 1983 ప్రపంచకప్‌లో ఇంగ్లండ్ జట్టుకు ఇయాన్ సేవలు అందించారు. మొత్తం 18 వన్డేల్లో ఇంగ్లండ్‌కు ప్రాతినిధ్యం వహించారు. ఫస్ట్ క్లాస్, లిస్ట్-ఎ మ్యాచ్‌లు కలిపి 600కు పైగా ఆడారు. 1990లో కీపింగ్ బాధ్యతల నుంచి తప్పుకుని మిడిలెస్సెక్స్‌కు కోచింగ్ బాధ్యతలు చేపట్టారు.
61 ఏళ్ల ఇయాన్ గౌల్డ్ 13 క్రితం అంతర్జాతీయ టీ20తో క్రికెట్‌లోకి అడుగుపెట్టారు. ఇంగ్లండ్- న్యూజిలాండ్ మధ్య సౌతాంప్టన్‌లో జరిగిన థ్రిల్లింగ్ మ్యాచ్‌లో ఇంగ్లండ్ రెండు పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్ జరిగిన ఐదు రోజుల తర్వాత ఈ రెండు జట్ల మధ్యే జరిగిన వన్డే మ్యాచ్‌తో అంతర్జాతీయ వన్డేల్లో అడుగుపెట్టాడు. ఆ వెంటనే ప్రపంచకప్‌లో ఆడే అవకాశం దక్కింది.