Srikakulam District: ఇచ్చాపురం ఎమ్మెల్యే అశోక్‌ను అడ్డుకున్న వైసీపీ నేతలు
- ప్రారంభోత్సవానికి వెళ్తుండగా దౌర్జన్యంగా నిలువరింత
- దీంతో తోపులాట...పరిస్థితి ఉద్రిక్తం
- పోలీసులకు ఫిర్యాదు చేసిన శాసన సభ్యుడు
ఓ ప్రారంభోత్సవానికి వెళ్తున్న శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం ఎమ్మెల్యే బెందాళం అశోక్‌ను స్థానిక వైసీపీ నేతలు అడ్డుకోవడంతో స్వల్పంగా ఉద్రిక్తత నెలకొంది. వివరాల్లోకి వెళితే నియోజకవర్గంలోని సోంపేట మండలం పలాసపురంలో ఉన్న అంగన్‌వాడీ భవనం ప్రారంభోత్సవానికి వచ్చిన ఎమ్మెల్యేను స్థానిక వైసీపీ నేతలు అడ్డుకున్నారు. ప్రారంభోత్సవం చేయడానికి వీలులేదని పట్టుబట్టారు. ఎమ్మెల్యేతో వాగ్వాదానికి దిగారు. ఈ క్రమంలో ఇరువర్గాల మధ్య తోపులాట జరిగింది. ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ ఘటనపై ఎమ్మెల్యే అశోక్ వైసీపీ నేతలపై సోంపేట పోలీసులకు ఫిర్యాదు చేయడమేకాక స్టేషన్ ముందు నిరసనకు దిగారు.