Ramprasad: అసలు నిందితులు ఎవరో పోలీసులే తేలుస్తారు: రాంప్రసాద్ బావ ఊర శ్రీనివాస్

  • రాంప్రసాద్ హత్య కేసులో ఊర శ్రీనివాస్ పై ఆరోపణలు
  • ఈ ఆరోపణలను కొట్టిపారేసిన వైనం
  • పోలీసుల దర్యాప్తులో నిజాలు బయటపడతాయన్న శ్రీనివాస్

ప్రముఖ వ్యాపారి రాంప్రసాద్ హత్య కేసులో ఆయన బావ ఊర శ్రీనివాస్ పై ఆరోపణలు తలెత్తిన విషయం తెలిసిందే. ఈ హత్యను ఊర శ్రీనివాస్ చేయించారని నిందితుడు శ్యామ్ ఆరోపించారు. ఈ కేసులో మొదటి నుంచి అనుమానాలు ఎదుర్కొంటున్న కోగంటి సత్యం కూడా ఊర శ్రీనివాస్ పై ఆరోపణలు చేస్తున్నారు. ఈ ఆరోపణలను ఊర శ్రీనివాస్ కొట్టిపారేశారు. పోలీసుల దర్యాప్తులో నిజాలు బయటపడతాయని, అసలు నిందితులు ఎవరనేది పోలీసులు తేలుస్తారని అన్నారు.

  • Loading...

More Telugu News