Virat Kohli: పిచ్ పై జారిపడనంతవరకు నా అంత ప్రమాదకరమైన బౌలర్ మరొకరులేరు: మీడియాతో కోహ్లీ జోక్

  • రేపు మాంచెస్టర్ లో భారత్, న్యూజిలాండ్ మధ్య సెమీఫైనల్
  • కోహ్లీ మీడియా సమావేశం
  • నవ్వులు పూయించిన టీమిండియా సారథి
ఐసీసీ క్రికెట్ వరల్డ్ కప్ లో భాగంగా రేపు మాంచెస్టర్ లో టీమిండియా, న్యూజిలాండ్ మధ్య సెమీఫైనల్ మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ కు ముందు భారత సారథి విరాట్ కోహ్లీ మీడియాతో ముచ్చటించాడు. ఈ సందర్భంగా విలేకరులు అడిగిన పలు ప్రశ్నలకు సరదాగా సమాధానమిచ్చాడు. పిచ్ పై జారిపడనంతవరకు తనకంటే ప్రమాదకరమైన బౌలర్ ఎవరూ ఉండరని జోక్ చేశాడు. తాను మ్యాచ్ లో ఏ సమయంలోనైనా బౌలింగ్ చేయగల దిట్టనని, అయితే పిచ్ పై పడిపోకుండా చూసుకోవడమే తనముందున్న అతిపెద్ద సమస్య అంటూ చమత్కరించాడు. తాను కూడా బౌలర్ నే కాబట్టి ఐదుగురు బౌలర్ల కాంబినేషన్ ను న్యూజిలాండ్ తో సెమీస్ మ్యాచ్ లో చూస్తారంటూ అందరినీ నవ్వించాడు.
Virat Kohli
India
New Zealand
World Cup
Semifinal

More Telugu News