Telugudesam: కార్యకర్తలు నన్ను నేరుగా కలవొచ్చు: నారా లోకేశ్
- ఈ ఉదయం మంగళగిరి టీడీపీ కార్యాలయంలో ఉంటా
- మధ్యాహ్నం నుంచీ గుంటూరు పార్టీ ఆఫీసులో
- కష్టమొచ్చినా, నష్టమొచ్చినా పార్టీ అండగా ఉంటుంది
నిన్న గుండిమెడలో నిర్వహించిన తాడేపల్లి మండల టీడీపీ సమీక్షా సమావేశానికి టీడీపీ నేత నారా లోకేశ్ ను ఆహ్వానించారు. ఈ సమావేశానికి తనను ఆహ్వానించడంపై లోకేశ్ తమ నాయకులు, కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ మేరకు వరుస ట్వీట్లు చేశారు. మంగళగిరి నియోజక వర్గంలో పార్టీ బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యలపై వారి అభిప్రాయాలు వెల్లడించారని అన్నారు.
ఏ ఒక్క కార్యకర్తకు కష్టమొచ్చినా, అంతా బాసటగా నిలవాలని తీర్మానించారని, గ్రామ స్థాయిలో పార్టీ సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించారని తెలిపారు. కార్యకర్తలు తనను నేరుగా కలవొచ్చని, ఈరోజు ఉదయం మంగళగిరి టీడీపీ కార్యాలయంలో, మధ్యాహ్నం నుంచీ గుంటూరు పార్టీ ఆఫీసులో ఉంటానని చెప్పాను. ‘నా కుటుంబసభ్యులైన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నేతల కోసం నా ఇంటి తలుపులెప్పుడూ తెరిచే ఉంటాయి. కష్టమొచ్చినా, నష్టమొచ్చినా పార్టీ అండగా ఉంటుంది’ అని లోకేశ్ పేర్కొన్నారు.