India: రష్యా నుంచి మరిన్ని సుఖోయ్, మిగ్ యుద్ధ విమానాల కొనుగోలు!

  • 18 సుఖోయ్, 21 మిగ్ విమానాల కోసం ఆర్డర్
  • సరిహద్దుల్లో భద్రత కోసమే
  • హెచ్ఏఎల్ లో విడిభాగాల అమరిక

రష్యా నుంచి మరిన్ని యుద్ధ విమానాలను కొనుగోలు చేయాలని భారత వాయుసేన నిర్ణయించింది. 18 సుఖోయ్ ఎస్యూ-30 మల్టీరోల్ విమానాలను,  21 మికోయాన్ మిగ్-29 ఫైటర్ జెట్ లను కొనుగోలు చేయనున్నట్టు అధికారులు తెలిపారు. సరిహద్దు ప్రాంతాల్లో పాకిస్థాన్, చైనా నుంచి వచ్చే ముప్పును తట్టుకునేందుకు వీటి అవసరం ఉందని వాయుసేన భావిస్తోంది.

ప్రస్తుతం ఐఏఎఫ్ వద్ద 272 సుఖోయ్, 69 మిగ్ విమానాలు ఉన్నాయి. మిగ్ 21, మిగ్ 27 రకాలకు చెందిన పాత విమానాల సేవలను ఇప్పటికే భారత్ నిలిపివేసింది. తమ భవిష్యత్ అవసరాల కోసం ఇండియా నుంచి 18 సుఖోయ్, 21 మిగ్ విమానాలను కోరిందని రష్యా ఫెడరల్ సర్వీస్ ఫర్ మిలిటరీ - టెక్నికల్ కో-ఆపరేషన్ డిప్యూటీ డైరెక్టర్ వ్లాదిమిర్ డ్రొజోజోవ్ వెల్లడించారు. మేకిన్ ఇండియాలో భాగంగా హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ లో విడిభాగాల అమరిక జరుగుతుందని ఆయన తెలిపారు.

  • Loading...

More Telugu News