Twitter: ట్విట్టర్ లో నా ఫాలోవర్ల సంఖ్య కోటికి చేరుకుంది.. ప్రతీఒక్కరికీ ధన్యవాదాలు!: రాహుల్ గాంధీ

  • అమేథీలో ఈరోజు కార్యకర్తలు, మద్దతుదారులతో సమావేశం
  • వారి మధ్యే ఈ రికార్డును సెలబ్రేట్ చేసుకుంటా
  • ట్విట్టర్ లో స్పందించిన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు
కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ మరో ఘనతను సాధించారు. ట్విట్టర్ లో రాహుల్ గాంధీని ఫాలో అవుతున్న వారి సంఖ్య కోటి (10 మిలియన్లకు)కు చేరుకుంది. ఈ నేపథ్యంలో రాహుల్ గాంధీ స్పందిస్తూ..‘ట్విట్టర్ లో నా ఫాలోవర్ల సంఖ్య 10 మిలియన్లకు చేరుకుంది. వీరిలో ప్రతీఒక్కరికీ ధన్యవాదాలు. ఈ మైలురాయిని అందుకున్న నేపథ్యంలో అమేథీలో కాంగ్రెస్ కార్యకర్తలతో కలిసి సంబరాలు జరుపుకుంటా. ఈరోజు అమేథీలో కాంగ్రెస్ కార్యకర్తలు, మద్దతుదారులతో భేటీ కాబోతున్నా’ అని ట్వీట్ చేశారు.

ఇటీవల ముగిసిన  సార్వత్రిక ఎన్నికల్లో అమేథీ లోక్ సభ స్థానంలో కేంద్ర మంత్రి స్మృతీ ఇరానీ  చేతిలో ఓడిపోయారు. అయితే కేరళలోని వయనాడ్ నుంచి కూడా పోటీచేసిన రాహుల్ విజయం సాధించారు. సార్వత్రిక ఎన్నికల్లో కేవలం 52 సీట్లకు కాంగ్రెస్ పరిమితం కావడానికి నైతిక బాధ్యత వహిస్తూ రాహుల్ కాంగ్రెస్ అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. అయితే సీడబ్ల్యూసీ ఆయన రాజీనామాను తిరస్కరించింది.
Twitter
Congress
Rahul Gandhi
followers
one crore
10 million

More Telugu News