India: ఇండియా-న్యూజిలాండ్ సెమీఫైనల్స్.. వెదర్ రిపోర్ట్

  • మాంచెస్టర్ వాతావరణంపై సర్వత్ర ఉత్కంఠ
  • ఒంటి గంట నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఆకాశం మేఘావృతం
  • ఆ తర్వాత వర్షం పడే అవకా

ప్రపంచకప్ లో భాగంగా ఓల్డ్ ట్రాఫోర్డ్ లో టీమిండియా-న్యూజిలాండ్ జట్ల మధ్య నిన్న జరిగిన సెమీఫైనల్స్ ను వర్షం అడ్డుకున్న సంగతి తెలిసిందే. దీంతో, నిన్న మ్యాచ్ ఎక్కడ ఆగిపోయిందో... అక్కడ నుంచే ఈరోజు (రిజర్వ్ డే) ఆట ప్రారంభం అవుతుంది. నిన్నటి ఆటలో న్యూజిలాండ్ 46.1 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 211 పరుగులు చేసింది. ఈ రోజు వర్షం ఆటంకం కలిగించకపోతే న్యూజిలాండ్ మిగతా ఓవర్లను ఆడుతుంది. ఆ తర్వాత భారత్ 50 ఓవర్లు ఆడుతుంది. వర్షం కారణంగా ఆటకు అంతరాయం కలిగితే... డక్ వర్త్ లూయిస్ నిబంధనల ప్రకారం ఆట కొనసాగుతుంది. మ్యాచ్ కు పూర్తిగా అంతరాయం కలిగితే... లీగ్ దశలో ఎక్కువ పాయింట్లు సాధించిన ఇండియా ఫైనల్స్ కు చేరుతుంది.

ఈ నేపథ్యంలో మాంచెస్టర్ వాతావరణంపై సర్వత్ర ఉత్కంఠ నెలకొంది. అక్యూవెదర్ వెల్లడించిన వివరాల ప్రకారం... ఈరోజు కూడా అడపాదడపా వర్షం పడే అవకాశం ఉంది. భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం ఒంటి గంట నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఆకాశం మేఘావృతమై ఉంటుంది. సాయంత్రం 5 గంటలకు వర్షం పడే అవకాశం ఉంది. 6 గంటల నుంచి 8 గంటల మధ్య వర్షం తగ్గుముఖం పడుతుంది. మళ్లీ 9 గంటల నుంచి 11 గంటల మధ్య వర్షం పలకరించే అవకాశం ఉంది. ఈ విధంగా వర్షం మధ్యమధ్యలో అడ్డుతగిలే అవకాశం ఉంది.

  • Loading...

More Telugu News