Rishikesh: పోటెత్తిన వరద.. ప్రమాదకర ఘంటికలు మోగిస్తున్న గంగానది

  • ఉత్తరాఖండ్ లో గత కొన్ని రోజులుగా వర్షాలు
  • నిన్న రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా భారీ వర్షం
  • రిషికేశ్ లో 338 మీటర్లకు చేరిన నీటిమట్టం

భారీగా కురుస్తున్న వర్షాలతో గంగానదికి వరద పోటెత్తుతోంది. రిషికేశ్ వద్ద గంగామాత ఉగ్రరూపం దాల్చింది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో రిషికేశ్ వద్ద గంగానది నీటిమట్టం 338.05 మీటర్లకు చేరుకుంది. ఈ ప్రాంతంలో గంగానది డేంజర్ మార్క్ 340 మీటర్లుగా ఉంది. ఈ నేపథ్యంలో ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. నదీ తీరంలో నివసించే వారు తగు జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు.

ఉత్తరాఖండ్ లోని అన్ని జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని నిన్ననే వాతావరణ శాఖ హెచ్చరించింది. గత కొన్ని రోజులుగా ఉత్తరాఖండ్ లో వర్షాలు కురుస్తున్నాయి. అయితే నిన్న రాత్రి నుంచి కురుస్తున్న భారీ వర్షాలతో గంగానదికి వరద పోటెత్తింది. పలుచోట్ల కొండ చరియలు కూడా విరిగి పడుతున్నాయి. ఈ నేపథ్యంలో, హిల్ స్టేషన్స్ కు వెళ్తున్న పర్యాటకులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.

  • Loading...

More Telugu News