athelet: ద్యుతీ.. నువ్వు భారత్ ను గర్వపడేలా చేశావ్!: ప్రధాని నరేంద్ర మోదీ
- 100 మీటర్ల పరుగుపందెంలో స్వర్ణ పతకం సాధించిన ద్యుతీ చంద్
- అభినందించిన రాష్ట్రపతి కోవింద్, ప్రధాని నరేంద్ర మోదీ
- ద్యుతీ అసాధారణ అథ్లెట్ అన్న ప్రధాని మోదీ
నాప్లెస్ లో జరుగుతున్న వరల్డ్ యూనివర్శిటీ గేమ్స్ లో భారత స్ప్రింటర్ ద్యుతీ చంద్ 100 మీటర్ల రేస్ లో బంగారు పతకం సాధించిన సంగతి తెలిసిందే. ఈ 100 మీటర్ల రేసును ద్యుతి కేవలం 11.32 సెకన్లలో పూర్తిచేసింది. ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ ద్యుతి చంద్ పై ప్రశంసల వర్షం కురిపించారు. ‘అసాధారణమైన అథ్లెట్ నుంచి అద్భుతమైన ప్రదర్శన ఇది.
కష్టపడి, పూర్తి అర్హతతో 100 మీటర్ల పరుగు పందెంలో బంగారు పతకం సాధించిన ద్యుతిచంద్ కు శుభాకాంక్షలు. భారత్ ను నువ్వు గర్వపడేలా చేశావ్’ అని ట్వీట్ చేశారు. ప్రధాని మోదీతో పాటు రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్, కేంద్ర మంత్రి కిరణ్ రిజుజు కూడా ద్యుతికి అభినందనలు తెలిపారు. తాను మరో అమ్మాయితో ప్రేమలో ఉన్నాననీ, అయితే తమ సంబంధానికి కుటుంబ సభ్యులు అడ్డుపడుతున్నారని గతంలో ద్యుతి సంచలన ఆరోపణలు చేసింది.