Sensex: మళ్లీ నష్టాల బాట పట్టిన మార్కెట్లు
- 173 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్
- 57 పాయింట్లు పతనమైన నిఫ్టీ
- 5 శాతం వరకు నష్టపోయిన బజాజ్ ఫైనాన్స్
నిన్న ఫ్లాట్ గా ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు నష్టాలను మూటగట్టుకున్నాయి. ట్రేడింగ్ మొదలైన తొలి గంటలో లాభాల్లో పయనించినప్పటికీ... ఆ తర్వాత సూచీలు నష్టాల్లోకి జారుకున్నాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 173 పాయింట్లు పతనమై 38,557కు పడిపోయింది. నిఫ్టీ 57 పాయింట్లు నష్టపోయి 11,498కి చేరింది.
బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
యస్ బ్యాంక్ (1.81%), సన్ ఫార్మా (1.44%), కొటక్ మహీంద్రా బ్యాంక్ (0.85%), ఐసీఐసీఐ బ్యాంక్ (0.75%), హెచ్డీఎఫ్సీ బ్యాంక్ (0.46%).
టాప్ లూజర్స్:
బజాజ్ ఫైనాన్స్ (-4.91%), టాటా స్టీల్ (-2.94%), టాటా మోటార్స్ (-2.79%), యాక్సిస్ బ్యాంక్ (-2.25%), వేదాంత లిమిటెడ్ (-0.96%).