Rahul Gandhi: టీమిండియా ఓటమిపై రాహుల్ గాంధీ వ్యాఖ్యలు

  • వంద కోట్ల హృదయాలు భగ్నమయ్యాయి
  • కానీ మీ పోరాటం అమోఘం
  • మా ప్రేమాభిమానాలకు మీరు అర్హులే
మాంచెస్టర్ లో జరిగిన వరల్డ్ కప్ సెమీఫైనల్ సమరంలో న్యూజిలాండ్ చేతిలో భారత్ ఓడిపోవడం పట్ల కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ స్పందించారు. టీమిండియా ఓటమికి వంద కోట్ల భారత హృదయాలు భగ్నమై ఉంటాయని, కానీ మ్యాచ్ లో విజయం కోసం టీమిండియా పోరాడిన తీరు అమోఘమని కొనియాడారు. తమ ప్రేమాభిమానాలకు టీమిండియా అర్హురాలని పేర్కొన్నారు. మరోవైపు, సెమీస్ లో 18 పరుగుల తేడాతో భారత్ ను ఓడించి ఫైనల్లో అడుగుపెట్టిన న్యూజిలాండ్ జట్టుకు రాహుల్ గాంధీ శుభాకాంక్షలు తెలిపారు. బాగా ఆడి గెలిచారంటూ ప్రశంసించారు.
Rahul Gandhi
Team India
World Cup
New Zealand
Semifinal

More Telugu News