Karnataka: సాయంత్రం 6 గంటల్లోగా స్పీకర్ ను కలవండి: కర్ణాటక రెబెల్ ఎమ్మెల్యేలకు సుప్రీంకోర్టు ఆదేశం

  • నేరుగా స్పీకర్ కు రాజీనామాలు ఇవ్వాలంటూ సుప్రీం ఆదేశాలు
  • వెంటనే నిర్ణయం తీసుకోవాలంటూ స్పీకర్ కు ఆదేశం
  • రెబెల్స్ కు భద్రత కల్పించాలని డీజీపీకి ఆదేశాలు

కర్ణాటకలోని కాంగ్రెస్-జేడీఎస్ సంకీర్ణ ప్రభుత్వాన్ని రక్షించేందుకు తమ రాజీనామాలను స్పీకర్ ఆమోదించడం లేదంటూ 10 మంది రెబెల్ ఎమ్మెల్యేలు ఆరోపించిన సంగతి తెలిసిందే. దీనికి సంబంధించిన పిటిషన్ ను ఈరోజు విచారించిన సుప్రీంకోర్టు... సాయంత్రం 6 గంటల్లోగా స్పీకర్ ను నేరుగా కలవాలని ఆదేశించింది. రాజీనామా చేయాలనుకున్న వారు తమ రాజీనామా పత్రాలను నేరుగా స్పీకర్ రమేశ్ కుమార్ కు అందజేయాలని సూచించింది. ఎమ్మెల్యేల రాజీనామాలపై స్పీకర్ వెంటనే నిర్ణయం తీసుకోవాలని ఆదేశించింది. అంతేకాదు, రెబెల్ ఎమ్మెల్యేలకు భద్రతను కల్పించాలని కర్ణాటక డీజీపీకి ఆదేశాలు జారీ చేసింది.

సుప్రీంకోర్టులో రెబెల్ ఎమ్మెల్యేల తరపున మాజీ అటార్నీ జనరల్ ముకుల్ రోహత్గి వాదిస్తూ, స్పీకర్ గా నిర్వహించాల్సిన బాధ్యతలను రమేశ్ కుమార్ నిర్వహించడం లేదని అన్నారు. స్పీకర్ ముందుకు ఎమ్మెల్యేలు వెళ్లేలా ఆదేశాలు జారీ చేయాలని కోరారు.

  • Loading...

More Telugu News