Atlanta: ఒక్కసారిగా తెరుచుకున్న ఆర్మీ వాహనం తలుపులు.. కురిసిన నోట్ల వర్షం

  • 1.75 లక్షల డాలర్లతో బయలు దేరిన ఆర్మీ ట్రక్
  • పెద్ద మొత్తంలో డబ్బు ఏరుకున్న వాహనదారులు
  • కొంత మొత్తాన్ని సేకరించిన ఆర్మీ అధికారులు
ఇప్పటి వరకూ రాళ్ల వర్షం, చేపల వర్షం గురించే విన్నాం.. తాజాగా ఒక చోట డబ్బుల వర్షం కురిసింది. అయితే అది ఆకాశం నుంచి కాదులెండి. ఓ వ్యాను డోర్ తెరచుకోవడంతో అదే సమయంలో గాలి వచ్చింది. దీంతో డబ్బంతా ఎగురుతూ బయటకు వచ్చేసింది. దీన్నంతా కొందరు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వీడియో తెగ వైరల్ అవుతోంది.

అమెరికాలోని జార్జియా రాష్ట్ర రాజధాని అట్లాంటాలో ఒక ఆర్మీ ట్రక్‌ 1.75 లక్షల డాలర్లు అంటే మన కరెన్సీలో సూమారు కోటి పదిలక్షల రూపాయలతో బుధవారం రాత్రి బయలు దేరింది. కొద్ది దూరం వెళ్లగానే వాహనానికి చెందిన తలుపు ఒక్కసారిగా తెరుచుకుంది.

అదే సమయంలో గాలి వీచడంతో డబ్బంతా బయటకు వచ్చేసింది. వాహనదారులు ఆ డబ్బు ఏరుకోవడమే కాకుండా ఆ దృశ్యాన్ని తమ మొబైల్ ఫోన్‌లో చిత్రీకరించి దానిని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీనిపై స్పందించిన పోలీసులు నగదుతో కూడిన ఆర్మీ వాహనం తలుపులు ఒక్కసారిగా తెరుచుకోవడంతో ఇది జరిగిందని, అధికారులు, సిబ్బంది కొంత మొత్తంలో నగదును సేకరించారని తెలిపారు. భారీ మొత్తంలో నగదును చాలా మంది ఎత్తుకుపోయారని చెప్పారు. అయితే ఈ వీడియో తెగ వైరల్ అవడంతో దీనిపై ట్విట్టర్‌లో కామెంట్లు, మీమ్‌లు వెల్లువెత్తుతున్నాయి.
Atlanta
Social Media
Army truck
Georgia
Money
Viral

More Telugu News