Andhra Pradesh: ఏపీ బడ్జెట్ 2019-20.. ముఖ్యాంశాలు-2

  • బడ్జెట్ ను ప్రవేశపెట్టిన మంత్రి బుగ్గన
  • పేదల కన్నీటిని తుడిచేలా బడ్జెట్ ఉందని వ్యాఖ్య
  • ప్రత్యేకహోదా, కృష్ణా ఆయకట్టు స్థిరీకరణ లక్ష్యమని ప్రకటన

ఆంధ్రప్రదేశ్ లో నిరుపేదల కన్నీటిని తుడిచేలా వైఎస్ జగన్ ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని ఏపీ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్ర నాథ్ తెలిపారు. ప్రతీ గ్రామానికి రక్షిత మంచినీరును అందిస్తామని అన్నారు. కృష్ణా నది ఆయకట్టు స్థిరీకరణ, ఏపీకి ప్రత్యేకహోదా లక్ష్యంగానే ముందుకు పోతున్నామని స్పష్టం చేశారు. ప్రభుత్వం జారీచేసే కాంట్రాక్టుల్లో పారదర్శకత పాటిస్తామన్నారు. ఏపీ అసెంబ్లీలో 2019-20 బడ్జెట్ ను బుగ్గన ఈరోజు ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా వేర్వేరు రంగాలకు ప్రభుత్వం చేసిన కేటాయింపులను మంత్రి ప్రకటించారు.

  • విద్యారంగానికి అధిక ప్రాధాన్యత.. రూ.32,618 కోట్ల కేటాయింపు
  • ఏపీలోని దివ్యాంగులకు పెన్షన్ల కోసం రూ.2,133.62 కోట్లు
  • ఒంటరి మహిళలకు పెన్షన్ల కోసం మరో రూ.300 కోట్లు
  • వ్యవసాయ అనుబంధ రంగాలకు రూ.20,677 కోట్లు
  • అమ్మఒడి పథకానికి రూ.6,455 కోట్ల కేటాయింపు
  • పాఠశాలల్లో మౌలిక వసతుల అభివృద్ధికి రూ.1,500 కోట్లు, 
  • నిర్వహణ గ్రాంటు కింద రూ.160 కోట్లు కేటాయింపు
  • మధ్యాహ్న భోజన పథకానికి రూ.1,077 కోట్లు

  • విద్యుత్ రంగానికి రూ.6,860 కోట్లు కేటాయింపు
  • వైద్య రంగానికి రూ.11,399 కోట్లు
  • పంచాయతీరాజ్-గ్రామీణాభివృద్ధి శాఖకు రూ.31,564.75 కోట్లు
  • ఏపీ రెవెన్యూ శాఖకు రూ.9,496.93 కోట్లు
  • గృహనిర్మాణం కోసం రూ.3,617 కోట్లు 
  • ఏపీలో సంక్షేమ రంగానికి రూ.14,142 కోట్లు
  • వైఎస్సార్ ఆరోగ్యశ్రీ పథకానికి రూ.1,740 కోట్లు కేటాయింపు
  • ఆశావర్కర్ల వేతనాల కోసం రూ.455.75 కోట్లు
  • ఏపీఎస్ ఆర్టీసీకి రూ.వెయ్యి కోట్లు కేటాయింపు

  • డ్వాక్రా మహిళలకు వడ్డీలేని రుణాల కోసం రూ.1,140 కోట్లు
  • వైఎస్సార్ గృహవసతి పథకానికి రూ.5,000 కోట్లు
  • దళితుల అభివృద్ధికి రూ.15,000 కోట్లు
  • గిరిజనుల అభివృద్ధికి రూ.4,988 కోట్లు
  • బీసీల అభివృద్ధికి రూ.1561 కోట్లు కేటాయింపు
  • గ్రామ సచివాలయాల నిర్వహణకు రూ.700 కోట్లు
  • మున్సిపల్ వార్డు వాలంటీర్లకు రూ.280 కోట్లు
  • న్యాయవాదుల సంక్షేమ ట్రస్టుకు రూ.100 కోట్లు
  • కొత్తగా ప్రాక్టీసు పెట్టుకునే లాయర్ల సంక్షేమానికి రూ.10 కోట్లు
  • నాయీ బ్రాహ్మణులు, రజకులు, దర్జీల సంక్షేమానికి రూ.300 కోట్లు

  • చేనేత కార్మికుల సంక్షేమానికి రూ.200 కోట్ల మంజూరు
  • ధార్మిక సంస్థల అభివృద్ధికి రూ.234 కోట్లు
  • బ్రాహ్మణ సంక్షేమ కార్పొరేషన్ కు రూ.100 కోట్లు
  • మెడికల్ భవనాల నిర్మాణానికి రూ.68 కోట్లు కేటాయింపు
  • వైఎస్సార్ గిరిజన వైద్యకళాశాల ఏర్పాటుకు రూ.66 కోట్లు
  • గురజాల ప్రభుత్వ మెడికల్ కాలేజీకి రూ.66 కోట్లు
  • విజయనగరం ప్రభుత్వ వైద్య కళాశాలకు రూ.66 కోట్లు
  • శ్రీకాకుళం జిల్లా పలాసలో కిడ్నీ పరిశోధన కేంద్రం.. రూ.50 కోట్లు కేటాయింపు

  • పట్టణాల్లోని స్వయం సహాయక బృందాలకు రూ.648 కోట్ల వడ్డీలేని రుణం
  • ఏపీ కేన్సర్ నివారణ ఆసుపత్రికి రూ.43 కోట్లు
  • మసీదుల్లో ఇమామ్ కు నెలకు రూ.10 వేలు, మౌజన్ కు రూ.5 వేల గౌరవవేతనం అందించాలని నిర్ణయం
  • అలాగే పాస్టర్లకు నెలకు రూ.5 వేలు గౌరవవేతనం చెల్లించాలని నిర్ణయించారు
  • దేవాలయ ట్రస్ట్ బోర్డులు, మార్కెట్ యార్డులు నామినేటెడ్ పోస్టులు, కాంట్రాక్టు పనుల్లో బీసీ, ఎస్టీ,ఎస్టీలకు 50 శాతం కోటా
  • ఇందుకోసం చట్టాన్ని తీసుకురావాలని నిర్ణయం
  • కాపు సామాజిక వర్గం సంక్షేమం కోసం రూ.2,000 కోట్ల కేటాయింపు

  • Loading...

More Telugu News