Andhra Pradesh: ఏపీ వ్యవసాయ బడ్జెట్... ముఖ్యాంశాలు
- రూ. 28,866 కోట్లతో వ్యవసాయ బడ్జెట్
- వైయస్సార్ రైతు భరోసాకు రూ. 8,750 కోట్లు
- 9 గంటల ఉచిత విద్యుత్తుకు రూ. 4,525 కోట్లు
2019-20 ఆర్థిక సంవత్సరానికి గాను శాసనసభలో వ్యవసాయ బడ్జెట్ ను మంత్రి బొత్స సత్యనారాయణ ప్రవేశపెట్టారు. వ్యవసాయ మంత్రి కురసాల కన్నబాబు సోదరుడు నిన్న గుండెపోటుతో మరణించడంతో... ఆయన స్థానంలో బొత్స బడ్జెట్ ను ప్రవేశపెట్టారు.
బడ్జెట్ లోని అంశాలు ఇవే...
- మొత్తం బడ్జెట్ - రూ. 28,866.23 కోట్లు
- రెవెన్యూ వ్యయం - రూ. 27,946 కోట్లు
- పెట్టుబడి వ్యయం - 919 కోట్లు
- వైయస్సార్ రైతు భరోసా - రూ. 8,750 కోట్లు
- వైయస్సార్ ఉచిత పంటల బీమా - రూ. 1,163 కోట్లు
- రైతు సంక్షేమం, వ్యవసాయ విభాగ అభివృద్ధి - రూ. 12,280 కోట్లు
- వడ్డీలేని రుణాల కోసం - రూ. 100 కోట్లు
- వైయస్సార్ రైతు బీమా - రూ. 100 కోట్లు
- ప్రకృతి వ్యవసాయం - రూ. 91 కోట్లు
- ధరల స్థిరీకరణ - రూ. 3వేల కోట్లు
- ఎన్జీ రంగా యూనివర్శిటీకి - రూ. 355 కోట్లు
- వ్యవసాయ యాంత్రీకరణ - రూ. 460 కోట్లు
- ఉద్యానవన శాఖ - రూ. 1,532 కోట్లు
- ఉద్యాన వర్శిటీకి - రూ. 63 కోట్లు
- పశు నష్టపరిహారం పథకం - రూ. 50 కోట్లు
- పట్టు పరిశ్రమ - రూ. 158 కోట్లు
- పశు సంవర్ధక శాఖకు - రూ. 1,240 కోట్లు
- పాల సేకరణ కేంద్రాలకు - రూ. 100 కోట్లు
- కోళ్ల పరిశ్రమ - రూ. 50 కోట్లు
- 2 పశు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులకు - రూ. 75 కోట్లు
- ఆక్వా రైతుల విద్యుత్ సబ్సిడీకి - రూ. 70 కోట్లు
- ఎస్వీ పశు వైద్య విద్యాలయానికి - రూ. 87 కోట్లు
- మత్స్యశాఖ అభివృద్ధి - 409 కోట్లు
- 9 గంటల ఉచిత విద్యుత్ - రూ. 4,525 కోట్లు
- వ్యవసాయానికి ఉపాధిహామీ అనుసంధానం - రూ. 3,626 కోట్లు
- వేట నిషేధ సమయంలో మత్స్యకారులకు - రూ. 100 కోట్లు
- మార్కెటింగ్ శాఖకు - రూ. 3,012 కోట్లు
- జాతీయ ఆహార భద్రత మిషన్ కు - రూ. 141 కోట్లు
- పొలం బడి - రూ. 89 కోట్లు
- భూసార నిర్వహణ - రూ. 30 కోట్లు
- వ్యవసాయ మౌలిక వసతులకు - రూ. 349 కోట్లు
- రైతులకు రాయితీపై విత్తనాలకు - రూ. 200 కోట్లు
- ప్రమాదవశాత్తు రైతు మృతి చెందితే రూ. 7 లక్షల పరిహారం
- రైతులకు 90 శాతం సబ్సిడీతో సోలార్ పంపుసెట్లు
- విపత్తు నిర్వహణ నిధికి - రూ. 2,002 కోట్లు