England: గప్టిల్ అవుటవడంతో వ్యూహం మార్చిన న్యూజిలాండ్
- వోక్స్ బౌలింగ్ లో గప్టిల్ అవుట్
- తొలి వికెట్ కోల్పోయిన కివీస్
- నిలదొక్కుకునేందుకు ప్రాధాన్యమిస్తున్న విలియమ్సన్, నికోల్స్
విఖ్యాత లార్డ్స్ మైదానంలో జరుగుతున్న ప్రపంచకప్ ఫైనల్లో న్యూజిలాండ్ మొదట బ్యాటింగ్
చేస్తోంది. ప్రమాదకర ఇంగ్లాండ్ బౌలర్లను ఎదుర్కొని ధాటిగా ఆడుతున్న కివీస్ ఓపెనర్ మార్టిన్ గప్టిల్ 19 పరుగుల వ్యక్తిగతస్కోరు వద్ద అవుటయ్యాడు. గప్టిల్ రెండు ఫోర్లు, ఓ భారీ సిక్స్ కొట్టాడు. అయితే, క్రిస్ వోక్స్ విసిరిన ఇన్ స్వింగర్ కు గప్టిల్ వికెట్ల ముందు దొరికిపోయాడు. అయితే, గప్టిల్ అవుట్ కావడంతో న్యూజిలాండ్ బ్యాటింగ్ ప్లాన్ మార్చేసింది. దూకుడుకు పోకుండా నిలకడగా ఆడుతూ క్రీజులో నిలదొక్కుకునేందుకు కెప్టెన్ కేన్ విలియమ్సన్, మరో ఓపెనర్ హెన్రీ నికోల్స్ ప్రయత్నిస్తున్నారు. ప్రస్తుతం కివీస్ స్కోరు 10 ఓవర్లలో 1 వికెట్ నష్టానికి 34 పరుగులు. నికోల్స్ 30 బంతులాడి 10 పరుగులు చేయగా, విలియమ్సన్ 13 బంతుల్లో 2 పరుగులు చేశాడు.