sangareddy: జల దీక్ష చేపట్టేందుకు వెళ్తున్న ఎమ్మెల్యే జగ్గారెడ్డి అరెస్టు

  • కొండాపూర్‌ పోలీస్‌ స్టేషన్‌కు తరలింపు
  • దీక్ష చేపట్టనున్నట్లు ఇదివరకే ప్రకటించిన శాసన సభ్యుడు
  • ప్రారంభానికి ముందే బ్రేక్‌
తెలంగాణ ఫైర్‌బ్రాండ్‌, సంగారెడ్డి ఎమ్మెల్యే తూర్పు జయప్రకాష్‌రెడ్డి అలియాస్‌ జగ్గారెడ్డిని ఈ ఉదయం పోలీసులు అరెస్టు చేశారు. గోదావరి జలాలను సంగారెడ్డి జిల్లాకు తరలించాలని ఎప్పటి నుంచో డిమాండ్‌ చేస్తున్న జగ్గారెడ్డి ఇందుకోసం అవసరమైతే దీక్ష చేస్తానని ప్రకటించారు. చెప్పినట్టే ఈ రోజు నుంచి జల దీక్ష చేపట్టనున్నట్లు కొద్దిరోజుల క్రితం ప్రకటించారు. ఇందులో భాగంగా ఈరోజు దీక్ష చేపట్టేందుకు వెళ్తున్న జగ్గారెడ్డిని పోలీసులు ముందుగానే అడ్డుకున్నారు. అక్కడి నుంచి ఆయనను కొండాపూర్‌ పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు.
sangareddy
MLA jaggareddy
arrest
jaladiksha

More Telugu News