Supriya: ఫస్టు మూవీ షూటింగులో పవన్ కల్యాణ్ ను చూసి బాధపడేదాన్ని: సుప్రియ

  • పవన్ తో తొలి సినిమా చేశాను 
  • అప్పట్లో ఆయన చాలా సిగ్గరి 
  • ఆయన రియల్ ఫీట్లు ప్రత్యక్షంగా చూశాను 

పవన్ కల్యాణ్ తొలి సినిమా 'అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి' అనే విషయం తెలిసిందే. ఈ సినిమాలో ఆయన జోడీగా సుప్రియ యార్లగడ్డ నటించింది. ఆమెకి కూడా ఇది తొలి సినిమానే. ఈవీవీ సత్యనారాయణ దర్శకత్వం వహించిన ఈ సినిమా భారీ విజయాన్ని నమోదు చేసింది. తాజా ఇంటర్వ్యూలో సుప్రియ మాట్లాడుతూ, ఆ సినిమా నాటి సంగతులను ప్రస్తావించింది.

'అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి' తొలి సినిమా కావడంతో పవన్ చాలా టెన్షన్ పడ్డారు. అప్పట్లో ఆయన సిగ్గరి .. షూటింగు సమయంలో ఎక్కువగా మాట్లాడేవారు కాదు. ఈ సినిమాలో పవన్ చేతులపై నుంచి కార్లు వెళతాయి. ఆయన ఛాతిపై పెద్ద బండరాళ్లను పగులగొడతారు. ఈ ఫీట్లను ఆయన రియల్ గా చేయడం నేను ప్రత్యక్షంగా చూశాను. ఆ సన్నివేశాల చిత్రీకరణ సమయంలో నా కళ్లలో నీళ్లు తిరిగేవి" అని చెప్పుకొచ్చింది.

  • Loading...

More Telugu News