Chennai: లారెన్స్ సాయం కోసం వచ్చి... స్టేషన్లో బిచ్చమెత్తుకుంటున్న కుటుంబం!

  • గుండెజబ్బుతో పుట్టిన బిడ్డ
  • లారెన్స్ ను సాయమడిగేందుకు చెన్నైకి
  • తిరుగు ప్రయాణానికి డబ్బులేక అవస్థ

ప్రముఖ సినీ నటుడు లారెన్స్‌ ను కలిసేందుకు వచ్చిన ఓ కుటుంబం, ప్రస్తుతం చెన్నై ఎగ్మోర్ రైల్వే స్టేషన్ ప్లాట్ ఫామ్ పై భిక్షాటన చేస్తున్న వైనం వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే, రాజపాళైయంకు చెందిన గృహలక్ష్మికి గురుసూర్య అనే చిన్నారి ఉండగా, పిల్లాడు రెండేళ్ల వరకూ మాట్లాడలేదు సరికదా, కనీసం నడవను కూడా నడవలేక పోయాడు. దీంతో వైద్యులను ఆశ్రయించగా, గురుసూర్య గుండెలో లోపం ఉందని వెల్లడైంది. ఆమె ఎన్నో ఆసుపత్రులకు తిరిగినా ప్రయోజనం లభించలేదు.

అండగా ఉండాల్సిన భర్త వదిలేసి వెళ్లడంతో, ఏం చేయాలో తెలియని స్థితిలో ఉన్న ఆమెను తోడబుట్టిన వెంకటేశన్ ఆదుకున్నాడు.  తన వివాహాన్ని పక్కనబెట్టి, సోదరిని, మేనల్లుడిని చూసుకుంటూ గడిపాడు. చెన్నై వెళ్లి లారెన్స్ ను కలిస్తే మేలు కలుగుతుందని, అతను ఆదుకుంటాడని చెబితే నమ్మి, గృహలక్ష్మిని, ఆమె బిడ్డను తీసుకుని చెన్నై వచ్చాడు.

అయితే లారెన్స్ దర్శనం వారికి లభించలేదు. తెచ్చుకున్న డబ్బులు అయిపోగా, తిరిగి ఊరికి వెళ్లే మార్గం కనిపించక, రైల్వే స్టేషన్ లోనే ఉండిపోయారు. వచ్చీపోయే ప్రయాణికులను ధర్మం అడుక్కుంటూ పొట్ట పోషించుకుంటున్నారు. వీరిని చూసిన పలువురు మీడియాకు విషయం చేరవేయడంతో వారి దీనగాథ వెలుగులోకి వచ్చింది.

  • Loading...

More Telugu News