KCR: కేసీఆర్కు ఎన్నికలు, కాళేశ్వరం తప్ప మరొకటి కనిపించట్లేదు: షబ్బీర్ అలీ
- కరవుపై సమీక్ష సమావేశాలు నిర్వహించట్లేదు
- ఆర్థిక పరిస్థితిపై వెంటనే శ్వేతపత్రం విడుదల చేయాలి
- విద్య, వైద్యంలపై కూడా చర్చ జరపాలి
రాష్ట్రంలో దాదాపు 450 మండలాలు కరవు కోరల్లో చిక్కుకున్నా కనీసం సమీక్ష సమావేశాలు కూడా నిర్వహించట్లేదని, పూర్తిగా ప్రభుత్వం పట్టించుకోవడం మానేసిందని కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి షబ్బీర్ అలీ ఆరోపించారు. నేడు ఆయన హైదరాబాదులోని గాంధీభవన్లో మీడియాతో మాట్లాడుతూ, రాష్ట్రంలో కరవు పరిస్థితులను ఎలా ఎదుర్కోవాలన్న విషయాలను విస్మరించిన సీఎం కేసీఆర్కు ఎన్నికలు, కాళేశ్వరం తప్ప మరొకటి కనిపించట్లేదని విమర్శించారు. ప్రస్తుతం రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై వెంటనే శ్వేతపత్రం విడుదల చేయాలని షబ్బీర్ అలీ డిమాండ్ చేశారు. ప్రస్తుతం రాష్ట్రం సమస్యల్లో ఉన్నందున తక్షణమే అసెంబ్లీ సమావేశాలు నిర్వహించి కరవుతో పాటు విద్య, వైద్యం తదితర అంశాలపై చర్చ జరపాలని షబ్బీర్ అలీ డిమాండ్ చేశారు.