Karnataka: కుమారస్వామికి సుప్రీంకోర్టులో భారీ ఊరట... విశ్వాస పరీక్ష ఇప్పట్లో లేనట్టే!

  • రాజీనామాలపై స్పీకర్ నిర్ణయమే ఫైనల్
  • మేము కల్పించుకునే అవకాశం లేదు
  • కర్ణాటక విషయంలో తీర్పిచ్చిన సుప్రీంకోర్టు

ఒక రాష్ట్ర శాసనసభ వ్యవహారాల్లో, అందునా స్పీకర్ నిర్ణయాధికారం కింద ఉన్న అంశాల్లో తాము జోక్యం చేసుకోబోమని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. కర్ణాటకలో రాజీనామాలు సమర్పించిన రెబల్ ఎమ్మెల్యేలు వేసిన పిటిషన్ పై కొద్దిసేపటిక్రితం తీర్పిచ్చిన సుప్రీంకోర్టు, విశ్వాస పరీక్ష ఎప్పుడు జరపాలన్న విశేషాధికారంతో పాటు, రాజీనామాలపై నిర్ణయం తీసుకోవాల్సింది కూడా ఆయనేనని స్పష్టం చేసింది. స్పీకర్ నిర్ణయం తీసుకునేంత వరకూ తాము కల్పించుకోబోమని వెల్లడించడంతో కర్ణాటకం కొత్త మలుపు తిరిగినట్లయింది. కుమారస్వామికి ఊరట కలుగగా, ముందనుకున్నట్టుగా విశ్వాస పరీక్ష రేపు జరిగే అవకాశాలు లేనట్టేనని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

  • Loading...

More Telugu News