Andhra Pradesh: పచ్చ దొంగలు మురిసిపోతున్నారు.. నాలుగు రోజులు ఓపిక పట్టండి.. దోచుకున్న వేల కోట్లు కక్కిస్తాం!: విజయసాయిరెడ్డి

  • కేంద్రం నుంచి క్లీన్ చిట్ రాలేదు
  • రాష్ట్ర ప్రభుత్వం విచారణ జరుపుకోవచ్చని కేంద్రం చెప్పింది
  • సీబీఐ దిగదని చంద్రబాబు మురిసిపోతున్నారు

పోలవరం ప్రాజెక్టులో అవినీతి విషయమై అధికార వైసీపీ, విపక్ష టీడీపీ మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. పోలవరం ప్రాజెక్టులో ఎలాంటి అవినీతి జరగలేదని టీడీపీ నేత బుద్ధా వెంకన్న చెప్పడంపై వైసీపీ నేత విజయసాయిరెడ్డి కౌంటర్ ఇచ్చారు. ఈరోజు ట్విట్టర్ లో విజయసాయిరెడ్డి స్పందిస్తూ..‘పోలవరం ప్రాజెక్టులో అవినీతి, విద్యుత్తు కొనుగోలు ఒప్పందాల విషయంలో కేంద్రం నుంచి క్లీన్ చిట్ వచ్చినట్టు మురిసి పోతున్నారు పచ్చదొంగలు.

నాలుగు రోజులు ఓపిక పట్టండి. అన్నీ బయటపడతాయి. దోచుకున్న రూ.వేల కోట్లు కక్కేదాకా మా ప్రభుత్వం వదిలి పెట్టదు’ అని వ్యాఖ్యానించారు. పోలవరం ప్రాజెక్టు అవినీతిపై రాష్ట్ర ప్రభుత్వం విచారణ జరుపుకోవచ్చని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసిందన్నారు. ఈ విషయంలో తాను రాజ్యసభలో అడిగిన ప్రశ్న, కేంద్ర మంత్రి ఇచ్చిన జవాబును చంద్రబాబు గారికి సరిగ్గా బ్రీఫ్ చేసినట్లు లేదని వ్యాఖ్యానించారు. సీబీఐ రంగంలోకి దిగదని చంద్రబాబు మురిసిపోతున్నట్లు ఉన్నారని ఎద్దేవా చేశారు.

  • Loading...

More Telugu News