Abdul razzak: పెళ్లి తర్వాత ఐదారుగురితో సంబంధాలు నెరిపాను: పాక్ మాజీ క్రికెటర్ అబ్దుల్ రజాక్ సంచలన వ్యాఖ్యలు

  • ఏడాదిన్నర కాలంలోనే సంబంధాలు పెట్టుకున్నా
  • హార్దిక్ పాండ్యాకు కోచింగ్ ఇచ్చి బెస్ట్ ఆల్‌రౌండర్‌గా తీర్చిదిద్దుతా
  • ముస్లిం కాబట్టే మహ్మద్ షమీ బాగా రాణించాడు

పాకిస్థాన్ మాజీ క్రికెటర్ అబ్దుల్ రజాక్ సంచలన విషయాన్ని బయటపెట్టాడు. పెళ్లి తర్వాత కూడా తాను ఐదారుగురు అమ్మాయిలతో వివాహేతర సంబంధాలు నెరిపానని చెప్పాడు. అది కూడా ఏడాదిన్నర కాలంలోనే ఇదంతా జరిగిందన్నాడు. ఓ టీవీ ఇంటర్వ్యూలో రజాక్ మాట్లాడుతూ ఈ విషయం వెల్లడించాడు. రజాక్ వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో పెను దుమారం రేగుతోంది. ఇటువంటి వ్యక్తులకు గౌరవం ఎలా లభిస్తుందని మండిపడుతున్నారు. ఇలాంటి వ్యాఖ్యలకు ప్రజలు నవ్వుతూ ఎలా చప్పట్లు కొడతారో? అని ఓ నెటిజన్ ప్రశ్నించాడు.

కాగా, రజాక్ మాట్లాడుతూ.. టీమిండియా ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యాకు కోచింగ్ ఇచ్చి ప్రపంచంలోనే అత్యుత్తమ ఆల్‌రౌండర్‌గా తీర్చిదిద్దాలని ఉందన్నాడు. అలాగే, ప్రపంచకప్‌లో ఇంగ్లండ్ చేతిలో భారత పరాజయంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. మహ్మద్ షమీ ముస్లిం కాబట్టే ఈ మ్యాచ్‌లో బాగా రాణించాడని పేర్కొన్నాడు. రజాక్ వ్యాఖ్యలపై సర్వత్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అయితే, పాకిస్థాన్ సెమీస్ ఆశలకు భారత్ గండికొట్టిందన్న ఫ్రస్ట్రేషన్‌లోనే అతడీ వ్యాఖ్యలు చేసి ఉంటాడని భావిస్తున్నారు.

  • Loading...

More Telugu News