Hyderabad metro: మెట్రో రైలు ప్రయాణికులకు శుభవార్త.. ఆగస్టు చివరి నుంచి హైటెక్ సిటీ-రాయ్‌దుర్గ్ మధ్య రైళ్ల పరుగు!
- కారిడార్-3లో భాగంగా నాగోల్-రాయ్‌దుర్గ్ మధ్య సర్వీసులు
- వర్షాకాలం నేపథ్యంలో ఈ మార్గంలో విపరీతమైన డిమాండ్
- త్వరితగతిన మార్గాన్ని సిద్ధం చేస్తున్న హైదరాబాద్ మెట్రో
మెట్రో రైలు ప్రయాణికులకు హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్ (హెచ్ఎంఆర్ఎల్) శుభవార్త చెప్పింది. ఆగస్టు చివరి నుంచి హైటెక్ సిటీ-రాయదుర్గ్ (మైండ్ స్పేస్) మధ్య రైళ్లు నడిపేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ప్రస్తుతం ఈ మార్గంలో చివరి పరీక్షలు (ఫైనల్ ఇన్సెక్షన్) నిర్వహిస్తున్నారు. వర్షాకాలం నేపథ్యంలో ట్రాఫిక్ జామ్‌ల నుంచి బయటపడేందుకు ఐటీ ఉద్యోగులు మెట్రోను ఆశ్రయిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఐటీ కారిడార్‌లో మెట్రోకు విపరీతమైన డిమాండ్ ఉంది. దీంతో ఈ మార్గం పనులను త్వరితగతిన పూర్తిచేసి అందుబాటులోకి తెచ్చేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. హైటెక్ సిటీ నుంచి రాయ్‌దుర్గ్‌కు 1.5 కిలోమీటర్లు కాగా, కారిడార్-3లో భాగంగా నాగోల్-రాయదుర్గ్ మధ్య రైళ్ల సర్వీసును పొడిగించనున్నారు.