Imran Khan: జాదవ్ క్రిమినలే... వదిలిపెట్టేదేం లేదు: ఇమ్రాన్ ఖాన్
- జాదవ్ ను వదిలివేయాలని చెప్పలేదు
- పాక్ ప్రజలకు వ్యతిరేకంగా నేరాలు చేశాడు
- చట్టప్రకారమే ముందుకు వెళతామన్న ఖాన్
ప్రస్తుతం పాకిస్థాన్ జైల్లో మగ్గుతున్న కుల్ భూషణ్ జాదవ్ కు మరణశిక్ష అమలును హేగ్ లోని అంతర్జాతీయ న్యాయస్థానం నిలిపివేసిన సంగతి తెలిసిందే. ఇది భారత్ సాధించిన విజయమని ప్రధాని నరేంద్ర మోదీ, సుష్మా స్వరాజ్ వంటి వారు వ్యాఖ్యానించారు కూడా. తాజాగా, ఐసీజే తీర్పుపై పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ స్పందించారు. ఈ మేరకు తన ట్విట్టర్ ఖాతాలో ఓ ట్వీట్ పెడుతూ కమాండర్ కుల్ భూషణ్ జాదవ్ ను విడిచి పెట్టమని, ఇండియాకు పంపాలని ఐసీజే చెప్పలేదని అన్నారు. పాకిస్థాన్ ప్రజలకు వ్యతిరేకంగా ఆయన నేరాలు చేశాడని స్పష్టం చేశారు. చట్ట ప్రకారం తాము ముందుకు వెళతామన్నారు.