Karnataka: కర్ణాటకలో ఎటూతేలని బలపరీక్ష!

  • కర్ణాటక అసెంబ్లీలో కొనసాగుతున్న వాయిదాల పర్వం 
  • విశ్వాసపరీక్ష వెంటనే నిర్వహించాలని బీజేపీ పట్టు
  • నిరసన వ్యక్తం చేస్తున్న బీజేపీ ఎమ్మెల్యేలు

కర్ణాటక అసెంబ్లీలో సంకీర్ణ ప్రభుత్వం బలపరీక్ష ఎటూ తేలలేదు. వాయిదాల పర్వం కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో విశ్వాసపరీక్ష వెంటనే నిర్వహించాలంటూ బీజేపీ సభ్యులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. రాజీనామా చేసిన 15 మంది రెబెల్ ఎమ్మెల్యేలు సభకు హాజరుకాలేదు. కాగా, అసెంబ్లీలో మొత్తం 225 మంది సభ్యులు ఉన్నారు. ఇందులో బీజేపీకి 105, కాంగ్రెస్ కు 80, జేడీఎస్ కు 37, స్వతంత్ర అభ్యర్థులు ఇధ్దరు, బీఎస్పీకి ఒకటి ఉంది.

కాంగ్రెస్ కు చెందిన 12 మంది, జేడీఎస్ కు చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు రాజీనామా చేశారు. రాజీనామాల అనంతరం కాంగ్రెస్ కు 68, జేడీఎస్ కు 34కు మంది సభ్యులు ఉన్నారు. వీరి రాజీనామాలను స్పీకర్ ఆమోదిస్తే కనుక సభ్యుల సంఖ్య 210కి పడిపోతుంది. అప్పుడు ప్రభుత్వం ఏర్పాటుకు కావాల్సిన మ్యాజిక్ ఫిగర్ 106 అవుతుంది. ఇద్దరు స్వతంత్ర ఎమ్మెల్యేల మద్దతుతో బీజేపీ బలం 107 ఉండటం గమనార్హం.  

  • Loading...

More Telugu News