roti bank: విద్యార్థుల సత్సంకల్పం...అభాగ్యుల ఆకలి తీర్చేందుకు ‘రోటీ బ్యాంక్‌’

  • నిర్వాహకులంతా చదువుకుంటున్నవారే
  • ఓ వాహనం సమకూర్చుకుని ఇంటింటికీ వెళ్లి రోటీల సేకరణ
  • ఆకలితో అలమటిస్తున్న వారికి వాటి పంపిణీ

సదాశయానికి జనం కూడా సహకరిస్తారు. వారంతా చదువుకుంటూ భవిష్యత్తుకోసం కష్టపడుతున్న విద్యార్థులు. తాము జీవితంలో స్థిరపడేందుకు కష్టపడడం తప్పని సరైనా, కొంత పరోపకారం చేద్దామన్న ఉద్దేశంతో అనాథల కడుపు నింపాలని నిర్ణయించారు. ఇందుకోసం ఓ స్వచ్ఛంద సంస్థను ఏర్పాటు చేశారు. కానీ అంతమొత్తం డబ్బు పెట్టుబడి పెట్టే స్థాయి వారికి లేదు. అందుకే ‘రోటీ బ్యాంక్‌’ ఏర్పాటు చేశారు. ఓ వాహనాన్ని సమకూర్చుకుని ఇంటింటికీ వెళ్లి రోటీలు సేకరిస్తున్నారు.

అనంతరం ఆకలితో అలమటిస్తున్న వారికి వాటిని పంపిణీ చేస్తున్నారు. గుజరాత్ రాష్ట్రం సూరత్‌లోని బర్దోలీకి చెందిన కొందరు విద్యార్థుల సదాశయానికి స్థానికులు ఎంతో సాయపడుతున్నారు. ఏ ఒక్కరూ ఆకలితో అలమటించకూడదన్నదే తమ ఉద్దేశమని, అందుకే గృహస్థుల్లో మిగులు ఆహారాన్ని సేకరించి వీరి ఆకలి తీరుస్తున్నామని విద్యార్థులు తెలిపారు.

  • Loading...

More Telugu News