Sensex: నిర్మలా సీతారామన్ వ్యాఖ్యల ప్రభావం.. భారీగా పతనమైన మార్కెట్లు
- 560 పాయింట్లు పతనమైన సెన్సెక్స్
- 177 పాయింట్లు కోల్పోయిన నిఫ్టీ
- 4 శాతం పైగా నష్టపోయిన ఎం అండ్ ఎం, బజాజ్ ఫైనాన్స్
దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు కుప్పకూలాయి. కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ నిన్న మాట్లాడుతూ, విదేశీ సంస్థాగత మదుపరులు కొత్త పన్నుల విధానంలో సర్ ఛార్జుల భారాన్ని తొలగించుకోవాలంటే ఇక్కడ తమ కంపెనీలను రిజిస్టర్ చేయించుకోవాలని తెలిపారు. ఈ వ్యాఖ్యలు ఇన్వెస్టర్లపై తీవ్ర ప్రభావాన్ని చూపాయి. మార్కెట్లలో అమ్మకాలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో, ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 560 పాయింట్లు పతనమై 38,337కి పడిపోయింది. నిఫ్టీ 177 పాయింట్లు కోల్పోయి 11,419కి దిగజారింది.
బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
ఎన్టీపీసీ (2.32%), పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (0.61%), టీసీఎస్ (0.55%), ఓఎన్జీసీ (0.42%).
టాప్ లూజర్స్:
మహీంద్రా అండ్ మహీంద్రా (-4.36%), బజాజ్ ఫైనాన్స్ (-4.16%), టాటా మోటార్స్ (-3.73%), హీరో మోటో కార్ప్ (-3.71%), ఇండస్ ఇండ్ బ్యాంక్ (-3.40%).