Kerala: కేరళను ముంచెత్తుతున్న భారీ వర్షాలు.. పలు జిల్లాల్లో హైఅలర్ట్

  • గత మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలు
  • సహాయక శిబిరాలకు లోతట్టు ప్రాంతాల ప్రజల తరలింపు
  • పలు డ్యాంల గేట్లు ఎత్తివేత

కేరళ రాష్ట్రంపై మరోసారి ప్రకృతి పంజా విసిరింది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలతో రాష్ట్రం చిగురుటాకులా వణుకుతోంది. గత మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలతో తిరువనంతపురం, విజింజమ్, కొల్లం నందకర జిల్లాల్లో ఏడుగురు మత్స్యకారులు గల్లంతయ్యారు. భారీ వర్షాల నేపథ్యంలో, లోతట్టు ప్రాంతాల్లో ఉండే వారిని సహాయ శిబిరాలకు తరలిస్తున్నారు. మరోవైపు, ఈరోజు కోజికోడ్, వయనాడ్ జిల్లాలో అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. మణప్పురం, కన్నూర్, ఇడుక్కి జిల్లాల్లో ఆరంజ్ అలర్ట్ ప్రకటించింది. వర్షాల కారణంగా వరదనీరు భారీగా వస్తుండటంతో... పంబ, కల్లార్ కుట్టి, భూతన్ కెట్టు, మలంకర డ్యామ్ ల గేట్లను తెరిచారు. నదీ తీర ప్రాంతాల్లో ఉంటున్న వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు.

  • Loading...

More Telugu News