Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్ లో 10 మంది ఐఏఎస్ అధికారుల బదిలీ!

  • కాపు కార్పొరేషన్ ఎండీగా ఎం.ఎన్.హెచ్ ప్రసాద్
  • సీసీఎల్ఏ సంయుక్త కార్యదర్శిగా విజయ సునీత
  • ఉత్తర్వులు జారీచేసిన సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యం

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తాజాగా 10 మంది ఐఏఎస్ అధికారులను బదిలీ చేసింది. ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి వేగంగా చేరవేసేందుకు, సంస్కరణల వేగం పెంచేందుకు వీలుగా సమర్థులైన అధికారులకు ముఖ్యమైన బాధ్యతలు అప్పగించింది. ఈ మేరకు ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం 10 మంది ఐఏఎస్ అధికారుల బదిలీపై ఉత్తర్వులు జారీచేశారు. బదిలీ అయిన అధికారుల వివరాలు ఇవే.

విశాఖ మెట్రోపాలిటన్ రీజియన్ డెవలప్ మెంట్ అథారిటీ కమిషనర్- పి.కోటేశ్వరరావు
సీసీఎల్‌ఏ ప్రత్యేక కమిషనర్‌-ఎం.హరినారాయణన్‌
పరిశ్రమల శాఖ (హెచ్‌అండ్‌టీ) విభాగం కార్యదర్శి- శ్రీనివాస్‌ శ్రీనరేశ్‌
పౌరసరఫరాల శాఖ డైరెక్టర్‌- పి.అరుణ్‌బాబు
గనుల శాఖ కార్యదర్శి- కె.రాంగోపాల్‌

కాపు కార్పొరేషన్‌ ఎండీ- ఎం.ఎన్‌.హెచ్‌.ప్రసాద్‌
సీసీఎల్‌ఏ సంయుక్త కార్యదర్శి- ఎం.విజయ సునీత
రాజమహేంద్రవరం సబ్‌కలెక్టర్‌- మహేశ్‌కుమార్‌ రావిరాల
ఎంప్లాయిమెంట్‌ అండ్‌ ట్రైనింగ్‌ డైరెక్టర్‌- లావణ్య వేణి
యువజన సర్వీసుల శాఖ ఎండీ, ఏపీ స్టెప్‌ ఎండీ- సి.నాగరాణి  

  • Loading...

More Telugu News