Rajanikant: బిడ్డను చిత్రవధ చేస్తున్న తల్లి... సంచలన వీడియోను పోస్ట్ చేసి పాపెవరో చెప్పాలన్న రజనీకాంత్ భార్య!
- 'దయా ఫౌండేషన్'ను నిర్వహిస్తున్న లతా రజనీకాంత్
- బాలిక ఎవరో తెలిస్తే చెప్పాలని వినతి
- బాలికకు రక్షణ కల్పించేందుకు సిద్ధమని వెల్లడి
అనాధ బాలల కోసం 'దయా ఫౌండేషన్'ను నిర్వహిస్తూ, వారిని ఆదుకునే ప్రయత్నం చేస్తున్న సూపర్ స్టార్ రజనీకాంత్ భార్య లత, ఓ సంచలన వీడియోను పోస్ట్ చేశారు. ఇందులో తీవ్ర చిత్ర హింసలను అనుభవిస్తున్న బాలిక ఎవరో ఎవరికైనా తెలిస్తే, తమకు తెలియజేయాలంటూ, ఓ ఫోన్ నంబర్ ను కూడా ఇచ్చారు.
'పీస్ ఆఫ్ చిల్డ్రన్స్' పేరిట సేవాకార్యక్రమాలను నిర్వహిస్తున్న లతా రజనీకాంత్, తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వీడియోలో, ఓ మహిళ, నిండా రెండేళ్లు కూడా ఉండని ఓ బాలికను చిత్ర వధ చేస్తోంది. ఎత్తి కుదేస్తూ, మీదెక్కి కూర్చోవడంతో పాటు, కాలితో తొక్కుతోంది. ఈ వీడియో చూసిన వారు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. సదరు బాలిక ఎవరో తెలిస్తే, వెంటనే చెప్పాలని, బాలికకు రక్షణ కల్పించేందుకు సిద్ధమని లతా రజనీకాంత్ తెలియజేశారు.