Uttarkashi: 132 గ్రామాల్లో 216 మంది జననం... ఒక్క అమ్మాయీ లేకపోవడం విడ్డూరం!
- ఉత్తరకాశి ప్రాంతంలో పుట్టని అమ్మాయిలు
- భ్రూణ హత్యలు జరుగుతున్నాయన్న అనుమానాలు
- సమగ్ర సర్వే నిర్వహిస్తామన్న కలెక్టర్
ఉత్తర కాశీ పరిధిలోని 132 గ్రామాల్లో గడచిన మూడు నెలల కాలంలో 216 మంది జన్మించగా, వారిలో ఒక్కరంటే ఒక్క అమ్మాయి కూడా లేకపోవడం విడ్డూరం. విషయం తెలుసుకున్న కలెక్టర్ డాక్టర్ ఆశిష్ చౌహాన్, అమ్మాయిలు పుట్టకపోవడానికి గల కారణాలను అన్వేషించేందుకు సమగ్ర సర్వేతో పాటు అధ్యయనం చేపట్టనున్నట్టు తెలిపారు.
కేంద్ర ప్రభుత్వం బేటీ బచావో - బేటీ పడావో కార్యక్రమాన్ని ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్నా, ఈ ప్రాంతంలో భ్రూణ హత్యలు చాలా ఎక్కువగా జరుగుతున్నాయని సమాచారం. లింగ నిర్ధారణ పరీక్షలు నిర్వహించకుండా అధికారులు ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా, క్షేత్ర స్థాయిలో ఫలితాలు మాత్రం దక్కడం లేదు.
కాగా, అమ్మాయిలు పుట్టకపోవడం అన్నది ఎంతమాత్రమూ కాకతాళీయం కాదని, దీని వెనుక చాలా పెద్ద కుట్రే ఉందని సామాజిక కార్యకర్త కల్పనా థాకూర్ ఆరోపించారు. భ్రూణ హత్యలు జరుగుతున్న విషయం తెలిసి కూడా ప్రభుత్వం చూస్తూ కూర్చుందని ఆరోపించారు.