karanataka: కర్ణాటకలో కూలిన సంకీర్ణ ప్రభుత్వం.. బల నిరూపణలో కాంగ్రెస్-జేడీఎస్ విఫలం!
- కర్ణాటక అసెంబ్లీలో విశ్వాస పరీక్ష
- సుదీర్ఘ చర్చ అనంతరం ఓటింగ్
- మ్యాజిక్ ఫిగర్ పొందలేకపోయిన సంకీర్ణ ప్రభుత్వం
కర్ణాటక విధానసభలో ఈరోజు నిర్వహించిన విశ్వాస పరీక్షలో కాంగ్రెస్-జేడీఎస్ ల సంకీర్ణ ప్రభుత్వం తమ బలాన్ని నిరూపించుకోలేకపోయింది. ముఖ్యమంత్రి కుమారస్వామి ప్రభుత్వం ప్రవేశపెట్టిన విశ్వాస తీర్మానంపై సుదీర్ఘ చర్చ అనంతరం స్పీకర్ డివిజన్ పద్ధతిలో ఓటింగ్ ను నిర్వహించారు. ఈ ఓటింగ్ లో ప్రభుత్వం తన బలాన్ని నిరూపించుకోలేకపోయింది. దీంతో కుమారస్వామి ప్రభుత్వం పతనమైంది.
విశ్వాస పరీక్ష ఓటింగ్ వివరాలు:
అనుకూల ఓట్లు: 99
వ్యతిరేక ఓట్లు: 105
మ్యాజిక్ ఫిగర్ : 103