IT Returns: శుభవార్త చెప్పిన ఆదాయపు పన్ను శాఖ.. పన్ను దాఖలుకు గడువు పెంపు

  • జూలై 31 నుంచి ఆగస్టు చివరి వరకు పెరిగిన గడువు
  • ఆ తర్వాత రిటర్న్ వేస్తే రూ.5 వేలు
  • వచ్చే ఏడాది మార్చిలోగా అయితే రూ.10 వేల రుసుము

ఆదాయపు పన్ను దాఖలు చేసే వారికి ఐటీ శాఖ శుభవార్త చెప్పింది. పన్ను దాఖలుకు ఈ నెల 31తో ముగియనున్న గడువును సరిగ్గా నెల రోజులు అంటే ఆగస్టు 31 వరకు  పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఐటీఆర్ సమర్పణ గడువు తేదీని పెంచాలని వచ్చిన డిమాండ్ల నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (సీబీడీటీ) వెల్లడించింది. వివిధ కేటగిరీలకు చెందిన పన్ను చెల్లింపుదారులు ఆ తేదీలోగా రిటర్నులను సమర్పించాల్సి ఉంటుంది’ అని ఆర్థిక మంత్రిత్వశాఖ ఒక ప్రకటనలో పేర్కొంది.

ఐటీఆర్‌ సమర్పణ గడువు తేదీని పెంచాలని వచ్చిన డిమాండ్ల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. గడువు తేదీ ముగిశాక కూడా రిటర్నులు దాఖలు చేయచ్చు. అయితే, ఇందుకు కొంత రుసుము చెల్లించాల్సి ఉంటుంది. ఈ ఏడాది చివరి నాటికి దాఖలు చేస్తే రూ.5 వేలు చెల్లించాల్సి ఉంటుంది. వచ్చే ఏడాది మార్చి 31 లోగా చేస్తే పదివేల రూపాయలు చెల్లించాల్సి ఉంటుందని ప్రభుత్వం తెలిపింది.

  • Loading...

More Telugu News