Andhra Pradesh: టీడీపీ అధినేత చంద్రబాబు కీలక నిర్ణయం.. పీఏసీ చైర్మన్ గా పయ్యావుల కేశవ్ పేరు ఖరారు!
- పీఏసీ చైర్మన్ కోసం గంటా, గోరంట్ల, అచ్చెన్న పోటీ
- నేతలందరినీ వెనక్కి నెట్టిన ఉరవకొండ ఎమ్మెల్యే
- పీఏసీ చైర్మన్ కు మంత్రి హోదా, ప్రోటోకాల్
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఉరవకొండ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ ను కీలకమైన పబ్లిక్ అకౌంట్స్ కమిటీ(పీఏసీ) చైర్మన్ గా ఖరారు చేశారు. ఈ పదవి కోసం టీడీపీ సీనియర్ నేతలు అచ్చెన్నాయుడు, గోరంట్ల బుచ్చయ్యచౌదరి, గంటా శ్రీనివాసరావు తీవ్రంగా ప్రయత్నించినప్పటికీ చివరికి పీఏసీ చైర్మన్ పదవి పయ్యావుల కేశవ్ నే వరించింది.
పీఏసీ చైర్మన్ కు మంత్రి హోదాతో పాటు ఎక్కడకు వెళ్లినా ప్రోటోకాల్ ఉంటుంది. అంతేకాదు.. ప్రాజెక్టుల్లో అవినీతి, భూ కేటాయింపులు, ఉద్యోగ నియామకాలు సహా పలు అంశాల్లో ప్రభుత్వాన్ని ప్రశ్నించే హక్కు కమిటీకి ఉంటుంది. ఈ కమిటీకి ప్రతిపక్ష పార్టీకి చెందిన సభ్యుడు అధ్యక్షుడిగా వ్యవహరిస్తారు. ఇటు వైసీపీ, అటు టీడీపీ ఎమ్మెల్యేలు ఇందులో సభ్యులుగా ఉంటారు.