Godavari: పెరిగిన గోదావరి వరద... ధవళేశ్వరం గేట్ల ఎత్తివేత!

  • ఎగువన కురుస్తున్న వర్షాలు
  • కాటన్ బ్యారేజ్ నుంచి 14,663 క్యూసెక్కుల నీరు సముద్రంలోకి
  • కొంత నీరు పంట కాలువలకు తరలింపు

ఎగువన కురుస్తున్న వర్షాలకు గోదావరిలో వరద ప్రవాహం పెరిగింది. ధవళేశ్వరం ఆనకట్టకు ఎగువ నుంచి 28,713 క్యూసెక్కుల వరద వస్తుండగా, బ్యారేజ్‌ నుంచి 14,663 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. నిన్న సాయంత్రానికి ధవళేశ్వరం వద్ద గోదావరి నీటిమట్టం 10.90 అడుగులుగా ఉంది. మిగతా నీటిలో వ్యవసాయ అవసరాల నిమిత్తం తూర్పు డెల్టాకు 4,500 క్యూసెక్కులు, మధ్య డెల్టాకు 2,250 క్యూసెక్కులు, పశ్చిమ డెల్టాకు 7 వేల క్యూసెక్కుల చొప్పున నీటిని విడుదల చేస్తున్నట్టు అధికారులు తెలిపారు.

  • Loading...

More Telugu News