PVP: మొద్దు... ఓసారి బడ్జెట్ చూడు: పీవీపీ

  • అగ్రీగోల్డ్ కు నిధులు కేటాయించాం
  • వాగేముందు హోమ్ వర్క్ చేసుకు రావాలి
  • ట్విట్టర్ లో పీవీపీ
ఏదైనా మాట్లాడే ముందు కాస్తంత హోమ్ వర్క్ చేసుకుని రావాలని పేరును వెల్లడించకుండా వైసీపీ నేత పీవీపీ వరప్రసాద్ సెటైర్లు వేశారు. మాట తప్పని, మడమ తిప్పని నాయకుడు జగన్ అని, అగ్రిగోల్డ్ కు ఇప్పటికే నిధులు కేటాయించామని అన్నారు. ఈ మేరకు తన ట్విట్టర్ ఖాతాలో ఓ ట్వీట్ ను ఉంచారు.

 "మొద్దు.. ఏపీ బడ్జెట్ ని ఓసారి చూడు, అగ్రిగోల్డ్ కోసం నిధులు ఆల్రెడీ కేటాయించారు. మాట తప్పని, మడమ తిప్పని, నాయకుడు వైఎస్ జగన్. హోంవర్క్ చేసుకుకోవాలిగా, లోడ లోడ వాగే ముందు. అలాగే మీ బాధితుల సంఘం ఒకటి ఏర్పడుతుంది. దానికి కాస్త బడ్జెట్ సూడు, బాబాయ్" అని అన్నారు.
PVP
Vijayawada
Agrigold
Twitter
Funds

More Telugu News