Pakistan: వివాదంలో పాకిస్థాన్‌ క్రికెటర్‌... అమ్మాయిల్ని చీట్‌ చేసినట్టు ఆరోపణలు

  • సెలబ్రిటీ ముసుగులో పలువురికి వల
  • పెళ్లి చేసుకుంటానంటూ శారీరక సంబంధం
  • చాటింగ్‌ స్క్రీన్‌ షాట్లను బయటపెట్టిన అక్కడి మీడియా
పాకిస్థాన్‌కు చెందిన ప్రముఖ క్రికెటర్‌ మెడకు మోసం ఉచ్చు బిగుస్తోంది. సెలబ్రిటీ ముసుగులో పలువురు అమ్మాయిల్ని మోసం చేసినట్టు అక్కడి మీడియా బయటపెట్టింది. పాకిస్థాన్‌ జట్టులో కీలక బ్యాట్స్‌మన్‌గా పేరొందిన ఇమామ్‌ ఉల్‌ హక్‌ పలువురు యువతులతో చేసిన ప్రేమ చాటింగ్‌ స్క్రీన్‌ షాట్లు ఇప్పుడు ట్విట్టర్‌లో వైరల్‌గా మారాయి.

పాక్‌ మీడియా కథనం మేరకు...ఓపెనర్‌ ఇమామ్‌ తన స్టార్‌డమ్‌ని ఉపయోగించుకుని పలువురు యువతులకు వలవేశాడు. పడిన వారిని పెళ్లి చేసుకుంటానని చెప్పి శారీరక అవసరం తీర్చుకున్నాడు. గడచిన ఐదారు నెలల్లోనే ఈ వ్యవహారాలు ఎక్కువగా కొనసాగాయని, ఇటీవల జరిగిన క్రికెట్‌ ప్రపంచకప్‌ సందర్భంగానూ ఇది జరిగిందని మీడియా పేర్కొంది.

ప్రపంచకప్‌లో ఇమామ్‌ పేలవ ప్రదర్శనకు కూడా ఇదే కారణమని మీడియా కథనం. ప్రస్తుతం ఈ వివాదం క్రికెట్‌ వర్గాల్లో ఆసక్తికర చర్చకు తెరలేపినా అక్కడి క్రికెట్‌ బోర్డు మాత్రం నోరు మెదపక పోవడం విశేషం.
Pakistan
imam ul huk
cheating case
Twitter

More Telugu News