Shoukath Ijaj Bhatt: పల్లకి ఎక్కిన అధికారి.. సోషల్ మీడియాలో వైరల్!

  • ఆసక్తికరంగా మారిన పల్లకిలో ప్రయాణం
  • అనారోగ్యం కారణంగానే పల్లకిలో వెళ్లినట్టు వెల్లడి
  • సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఫోటో
ఓ గ్రామాన్ని సందర్శించేందుకు అధికారి ఎంచుకున్న ప్రయాణ సాధనం ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతం ఆ అధికారికి సంబంధించిన ఫోటో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. జమ్ముకశ్మీర్‌లోని రాంబన్ జిల్లాకు అభివృద్ది అధికారిగా పని చేస్తున్న షౌకత్ ఐజాజ్ భట్(58) జిల్లాలోని ఓ గ్రామాన్ని సందర్శించేందుకు పల్లకిలో వెళ్లారు. విధులు నిర్వర్తిస్తున్న సమయంలో తాను అకస్మాత్తుగా అనారోగ్యం పాలయ్యానని అందువల్లే తాను పల్లకిలో వెళ్లాల్సి వచ్చిందని షౌకత్ తెలిపారు. ఆయన పల్లకిలో వెళుతుండగా ఒక వ్యక్తి ఫోటో తీసి దానిని సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ప్రస్తుతం అది తెగ వైరల్ అవుతోంది.
Shoukath Ijaj Bhatt
Jammu And Kashmir
Ramban
Social Media
Photo

More Telugu News