Jagan: 108 ఉద్యోగులతో చర్చలు సఫలం.. సమస్యల పరిష్కారానికి జగన్ ఓకే!
- ఉద్యోగ భద్రతపై ప్రభుత్వం హామీ ఇవ్వాలంటూ ఐదు రోజులుగా సమ్మె
- 31లోపు పెండింగ్ వేతనాలు చెల్లించేందుకు జగన్ హామీ
- ఉద్యోగ భద్రత కోసం ప్రత్యేక పాలసీ
ఉద్యోగ భద్రతపై హామీతోపాటు పెండింగ్ వేతన బకాయిలను చెల్లించాలని, 108 అంబులెన్స్‌లు పెంచాలని కోరుతూ గత ఐదు రోజులుగా చేస్తున్న సమ్మెను ఏపీకి చెందిన 108 ఉద్యోగులు విరమించారు. ముఖ్యమంత్రి జగన్‌మోహన్ రెడ్డితో జరిపిన చర్చలు సఫలమయ్యాయని, సమ్మె విరమిస్తున్నామని 108 ఉద్యోగ సంఘాల నేతలు ప్రకటించారు. తమ సమస్యల పరిష్కారానికి సీఎం జగన్ సానుకూలంగా స్పందించారని, ఈ నెల 31లోపు వేతన బకాయిలు చెల్లిస్తామని హామీ ఇచ్చారని తెలిపారు. అలాగే, ఉద్యోగ భద్రత కోసం ప్రత్యేకంగా ఓ విధానాన్ని తీసుకొస్తామని ఈ సందర్భంగా వారికి జగన్ హామీ ఇచ్చినట్టు తెలుస్తోంది.