High Court: టోల్ గేట్ రుసుము రద్దు కోరుతూ పిటిషన్.. విచారణ చేపట్టిన తెలంగాణ హైకోర్టు
- టోల్‌గేట్ వద్ద భేద భావాలు చూపించకూడదు
- కొందరికి మినహాయింపు ఇస్తున్నారు
- అందరిని సమదృష్టితో చూడాలి
టోల్ గేట్ రుసుము రద్దుపై దాఖలైన పిటిషన్‌పై నేడు తెలంగాణ హైకోర్టు ధర్మాసనం విచారణ చేపట్టింది. ఈ ట్యాక్స్ సామాన్యులకు మాత్రమే అమలవుతోందని దీని నుంచి ప్రజా ప్రతినిధులను, ప్రభుత్వ అధికారులను వదిలేస్తున్నారని, కాబట్టి ఈ ట్యాక్స్‌ను రద్దు చేయాలని పిటిషనర్ కోరారు.
నిజానికి టోల్ గేట్ వద్ద ఎలాంటి భేద భావాలూ చూపించకుండా ట్యాక్స్‌ను వసూలు చేయాలని, కానీ అక్కడ అందుకు విరుద్ధంగా జరుగుతోందని కోర్టుకు పిటిషనర్ వివరించారు. పిటిషనర్ వాదనను విన్న ధర్మాసనం టోల్ ట్యాక్స్ కట్టకుంటే రహదారుల మెయింటెనెన్స్ ఎలా సాధ్యమని ప్రశ్నించింది. అంతే కాకుండా టోల్ ట్యాక్స్ చెల్లించని వారికి సంబంధించి పూర్తి సమాచారం అందించాలని ధర్మాసనం పిటిషనర్‌ను ఆదేశించింది. దీనిపై తదుపరి విచారణను వచ్చే వారానికి వాయిదా వేసింది.