ISRO: 'చంద్రయాన్- 2' అప్ డేట్స్: భూ కక్ష్యను మరోసారి పెంచిన ఇస్రో
- రెండో సారి కక్ష్యను పెంచడంలో విజయవంతమైన ఇస్రో
- మొదటి భూ కక్ష్యను బుధవారం పెంచారు
- 29న మూడోసారి కక్ష్యను పెంచనున్న ఇస్రో
భారత ప్రతిష్ఠాత్మక మిషన్ చంద్రయాన్-2 కక్ష్యను రెండోసారి పెంచడంతో అది 251×56829 కిలోమీటర్ల ఎత్తున ఉన్న భూ కక్ష్యలోకి చేరింది. బుధవారం మొదటి భూ కక్ష్యను పెంచిన ఇస్రో, నేటి తెల్లవారుజామున 1.08 గంటలకు రెండోసారి కక్ష్యను పెంచారు.
వాహకనౌక పేరామీటర్స్ అన్నీ సరిగ్గా ఉన్నాయని, 883 సెకన్లపాటు ఆన్బోర్డులో ఉన్న ఇంధనాన్ని మండించడం ద్వారా కక్ష్య పెంపుదల విజయవంతమైనట్టు ఇస్రో వెల్లడించింది. జులై 29 మధ్యాహ్నం మూడోసారి కక్ష్యను పెంచే ప్రక్రియను చేపట్టనున్నట్టు అధికారులు పేర్కొన్నారు. ఇలా కక్ష్యను పెంచే ప్రక్రియను ఆగస్టు14 వరకూ చేపడతామని ఇస్రో వెల్లడించింది.