Adhir Ranjan Chowdary: పీఏసీ చైర్మన్‌గా ఎంపీ అధిర్ రంజన్ చౌదరిని నియమిస్తూ లోక్‌సభ స్పీకర్ ఉత్తర్వులు

  • 2020 ఏప్రిల్‌ 30 వరకు చైర్మన్‌గా అధిర్ రంజన్
  • లోక్‌సభ నుంచి 15 మంది సభ్యులు
  • 15 మందిలో 9 మంది బీజేపీ ఎంపీలే

ప్రజా పద్దుల సంఘానికి చైర్మన్‌గా పార్లమెంటులో కాంగ్రెస్‌ లోక్‌సభా పక్షనేత, ఎంపీ అధిర్‌ రంజన్‌ చౌదరిని నియమిస్తూ లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నెల 24న మొదలైన నూతన పీఏసీకి చైర్మన్‌గా అధిర్ రంజన్ చౌదరి 2020 ఏప్రిల్‌ 30 వరకు వ్యవహరిస్తారు. దీనిలో ఏడుగురు రాజ్యసభ నుంచి, పదిహేను మంది లోక్‌సభ నుంచి సభ్యులుగా ఉంటారు.

ఇక లోక్‌సభ నుంచి ఎక్కువ సంఖ్యలో బీజేపీ ఎంపీలు (9 మంది) ఉండగా, మిగిలిన సభ్యులు వైసీపీ, శివసేన, డీఎంకే, జనతాదళ్ యునైటెడ్, బిజూ జనతాదళ్ పార్టీల నుంచి కమిటీ సభ్యులుగా ఉన్నారు. రాజ్యసభ నుంచి సీఎం రమేశ్, భువనేశ్వర్ కలిత, రాజీవ్ చంద్రశేఖర్, భూపేందర్ యాదవ్, ఎం.వి.రాజీవ్ గౌడ, సుఖేందు శేఖర్ రాయ్, నరేశ్ గుజ్రాల్ పీఏసీ సభ్యులుగా వ్యవహరించనున్నారు.

  • Loading...

More Telugu News