awards: టీమిండియా క్రికెటర్ హర్బజన్ అవార్డు నామినేషన్ తిరస్కృతి : స్ప్రింటర్ ద్యుతీచంద్ది కూడా
- క్రీడాశాఖ నిర్ణయం
- అర్జున్ కు ద్యతీచంద్, ఖేల్‌రత్నకు హర్బజన్ దరఖాస్తు
- గడువులోగా దరఖాస్తులు అందక పోవడమే కారణం
గడువులోగా దరఖాస్తులు అందక పోవడంతోపాటు పతకాల ర్యాంకింగ్స్‌లో లేకపోవడంతో టీమిండియా క్రికెటర్ హర్బజన్‌సింగ్, స్ప్రింటర్ ద్యుతీచంద్ అవార్డుల నామినేషన్లను క్రీడాశాఖ తిరస్కరించింది. ఖేల్‌రత్న అవార్డుకు హర్బజన్, అర్జున్ అవార్డుకు ఒడిశాకు చెందిన ద్యుతీచంద్లు దరఖాస్తు చేసుకున్నారు. అయితే రాష్ట్ర ప్రభుత్వాలు గడువు తర్వాత వారి నామినేషన్లను దాఖలు చేశాయి. హర్బజన్ నామినేషన్ తిరస్కరణకు ప్రత్యేక కారణాలు చెప్పని క్రీడాశాఖ నామినేషన్ ర్యాంకింగ్ ఆర్డర్లో ద్యుతీచంద్ ఐదో స్థానంలో ఉందని, అందుకే ఆమె నామినేషన్ తిరస్కరించారని మాత్రం పేర్కొంది. దీనిపై ద్యుతీచంద్ స్పందిస్తూ ఈ అంశంపై తాను ముఖ్యమంత్రి నవీన్‌పట్నాయక్‌ను కలిశానని, ఆయన తిరిగి దరఖాస్తు పంపిస్తామన్నారని తెలిపింది. అందుకే అర్జున్ అవార్డు అవకాశం తానింకా కోల్పోలేదని భావిస్తున్నట్లు తెలిపారు.