Kerala: బిషప్ ములక్కల్ ను కాపాడేందుకు ప్రయత్నిస్తున్నారు.. కేరళ నన్ ఆరోపణ!
- సన్యాసినుల్ని వేధించిన బిషప్ ములక్కల్
- 2017లోనే కేసు నమోదుచేసిన పోలీసులు
- విచారణ సాక్ష్యాలను తారుమారు చేస్తున్నారన్న బాధితులు
కేరళకు చెందిన బిషప్ ఫ్రాంకో ములక్కల్ లైంగిక వేధింపుల కేసు వివాదం మరింత ముదురుతోంది. బిషప్ ఫ్రాంకో ములక్కల్ కొందరు క్రైస్తవ సన్యాసినులను వేధించినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ములక్కల్ ను కాపాడేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని బాధితులు ఆరోపించారు. ఈ కేసులో సాక్ష్యాలను తారుమారు చేసేందుకు ప్రయత్నిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
దీనివెనుక ములక్కల్ హస్తం ఉందన్నారు. ఈ కేసులో సరైన పత్రాలు సమర్పించకుంటే ఫోరెన్సిక్ ల్యాబ్ సిబ్బందిపై తాము పోలీసులకు ఫిర్యాదు చేస్తామని హెచ్చరించారు. బిషప్ ఫ్రాంకో ములక్కల్ 2014 నుంచి 2016 మధ్య తనను లైంగికంగా వేధించారని కేరళ నన్ 2018 జూన్ 27న కొట్టాయం పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ నేపథ్యంలో సైబర్ ఫోరెన్సిక్ రిపోర్ట్‌ను తక్షణమే సమర్పించాలని పాలాలోని జ్యుడిషియల్ మేజిస్ర్టేట్ కోర్టు విచారణాధికారిని ఆదేశించింది.