SBI: ఫిక్స్ డ్ డిపాజిట్లపై వడ్డీరేట్లు తగ్గించిన ఎస్ బీఐ
- సవరించిన వడ్డీ రేట్లను ప్రకటించిన ఎస్ బీఐ
- తక్కువ కాలపరిమితి డిపాజిట్లపై 50 నుంచి 75 బేసిస్ పాయింట్లు తగ్గింపు
- రిటైల్ డిపాజిట్లపై 20 బేసిస్ పాయింట్లు తగ్గింపు
దేశంలో అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్ బీఐ) ఫిక్స్ డ్ డిపాజిట్లపై వడ్డీరేట్లను తగ్గించింది. ఈ మేరకు సవరించిన వడ్డీరేట్లను ప్రకటించింది. తక్కువ కాలపరిమితి డిపాజిట్లపై 50 నుంచి 75 బేసిస్ పాయింట్లు తగ్గించారు. రిటైల్ డిపాజిట్లపై 20 బేసిస్ పాయింట్లు తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నారు. సవరించిన వడ్డీ రేట్లు ఆగస్టు 1 నుంచి అమల్లోకి రానున్నాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రుణాలపై వడ్డీ రేట్లను 75 బేసిస్ పాయింట్లకు తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్న దరిమిలా ఎస్ బీఐ తన తాజా వడ్డీరేట్లను ప్రకటించినట్టు తెలుస్తోంది.