Shakeela: మా అక్కయ్య మోసం చేసింది .. నాకంటూ ఏమీ లేకుండా పోయింది: సినీ నటి షకీలా
- నటిగా బిజీగా ఉండేదానిని
- మా బ్రదర్ నా డేట్స్ చూసేవాడు
- నా డబ్బు మా అక్కయ్య దాచేదన్న షకీలా
తెలుగు .. తమిళ .. మలయాళ .. కన్నడ భాషల్లో శృంగార తారగా షకీలా చాలా సినిమాలు చేశారు. అప్పట్లో ఆమె ప్రధాన పాత్రధారిగా కథలు తయారయ్యేవి .. ఆమెతో సినిమాలు చేయడానికి దర్శక నిర్మాతలు పోటీ పడేవారు. ఒక వర్గం ప్రేక్షకులు ఆమె సినిమాల కోసం ఎదురుచూసేవారు.
అంతగా తన గ్లామర్ తో ప్రభావితం చేసిన షకీలా ఐ డ్రీమ్స్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ .. "నా అసలు పేరే షకీలా .. ఇది సినిమా కోసం మార్చుకున్నది కాదు. మా అమ్మానాన్నల పేర్లు చాంద్ బాషా - చాంద్ బేగం. నటిగా నేను ఫుల్ బిజీగా వున్నప్పుడు నా డేట్స్ మా బ్రదర్ చూసేవాడు .. వచ్చిన డబ్బును మా అక్కయ్య తన దగ్గర దాచేది. నా పేరున ఏమైనా కొనుక్కుందామనుకుంటే ఏదో ఒక రకంగా మా అక్కయ్య అడ్డుపడేది. నమ్మిన అక్కయ్య మోసం చేయడంతో, అలా నాకంటూ ఏమీ లేకుండా పోయింది. ఆమె ఉద్దేశాన్ని నేను గ్రహించేసరికి ఆలస్యం జరిగిపోయింది" అని చెప్పుకొచ్చారు.