Sensex: కుప్పకూలిన 'కాఫీ డే' షేర్లు.. మార్కెట్ కు నేడూ నష్టాలే!
- ఈరోజు కూడా నష్టాలను మూటగట్టుకున్న మార్కెట్లు
- 289 పాయింట్లు పతనమైన సెన్సెక్స్
- 20 శాతం వరకు పడిపోయిన కాఫీ డే షేర్లు
దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు కూడా నష్టాలను మూటగట్టుకున్నాయి. అమ్మకాల ఒత్తిడితో సూచీలు తడబాటుకు గురయ్యాయి. ఈ రోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 289 పాయింట్లు పతనమై 37,397కి పడిపోయింది. నిఫ్టీ 103 పాయింట్లు కోల్పోయి 11,085 వద్ద స్థిరపడింది. మరోవైపు, కాఫీ డే వ్యవస్థాపకుడు వీజీ సిద్ధార్థ్ అదృశ్యం కావడం ఆ కంపెనీ షేర్లపై తీవ్ర ప్రభావాన్ని చూపింది. కాఫీ డే ఎంటర్ ప్రైజెస్ లిమిటెడ్ షేర్ వాల్యూ 19.99 శాతం పడిపోయింది.
బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
భారతీ ఎయిర్ టెల్ (3.19%), టీసీఎస్ (2.32%), హెచ్సీఎల్ టెక్నాలజీస్ (0.83%), ఐటీసీ (0.49%), ఎల్ అండ్ టీ (0.36%).
టాప్ లూజర్స్:
యస్ బ్యాంక్ (-9.13%), ఇండస్ ఇండ్ బ్యాంక్ (-6.66%), సన్ ఫార్మా (-4.79%), స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (-4.70%), టాటా స్టీల్ (-4.33%).