Gujarath: వివేకా హత్య కేసులో పరమేశ్వరరెడ్డికి కూడా నార్కో అనాలసిస్ పరీక్ష
- నార్కో అనాలసిస్ పరీక్ష నిమిత్తం గుజరాత్‌కు తరలింపు
- పరమేశ్వరరెడ్డికి పరీక్షపై కోర్టు సానుకూల స్పందన
- పరమేశ్వరరెడ్డి అనుమతితోనే పరీక్ష నిర్వహించాలని సూచన
తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన మాజీ మంత్రి, సీఎం జగన్ బాబాయి వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసులో నార్కో ఎనాలసిస్ పరీక్ష ఎదుర్కోనున్న వారి సంఖ్య నలుగురికి చేరింది. ఇప్పటికే రంగన్న, శేఖర్‌రెడ్డి, ఎర్ర గంగిరెడ్డిని నార్కో అనాలసిస్ పరీక్ష కోసం సిట్ బృందం గుజరాత్‌కు తరలించింది. వీరితో పాటు పరమేశ్వరరెడ్డి అనే వ్యక్తికి కూడా నార్కో అనాలసిస్ పరీక్ష చేయాలంటూ దాఖలైన పిటిషన్‌పై నేడు పులివెందుల కోర్టు సానుకూలంగా స్పందించింది. అయితే పరమేశ్వరరెడ్డి అనుమతితోనే నార్కో అనాలసిస్ పరీక్ష నిర్వహించాలని కోర్టు సూచించింది.